కొత్తగూడ గ్రామంలో వినాయ‌కుడికి రవికుమార్ యాదవ్ పూజ‌లు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను భ‌క్తులు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాల‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, శేరిలింగంప‌ల్లి ఇన్‌చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ సూచించారు. వినాయ‌క న‌వ‌రాత్రుల నేప‌థ్యంలో కొండాపూర్ డివిజన్ కొత్తగూడ గ్రామంలో స్థానిక‌ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వినాయ‌కున్ని ఆయ‌న ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ర‌వికుమార్ యాదవ్ మాట్లాడుతూ గ‌ణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వాల‌ను భ‌క్తులు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాల‌ని అన్నారు. మండ‌పాల వ‌ద్ద భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా నిర్వాహ‌కులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక బీజేపీ నాయ‌కులు, కాల‌నీ వాసులు, భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here