వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల కోసం భ‌క్తుల‌కు అన్ని ర‌కాల ఏర్పాట్లు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ , తారా నగర్, తుల్జాభవాని దేవాలయం ప్రాంగణంలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన‌ వినాయక మండపాల్లో సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్స‌వాల‌ను ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని రకాల వసతులు క‌ల్పించామ‌ని అన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించడం జరిగింద‌న్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , భక్తులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here