శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో తుల్జా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపనపల్లి తండా ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించినందుకు తుల్జా భవాని యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






