మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో రోజు రోజుకీ భారీగా రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ లోకి కొత్తగా వలసలు ఆరంభం అయ్యాయి. శనివారం మియపూర్ జయప్రకాష్ నగర్ కాలనీలో జరిగిన టీఆర్ఎస్ సభలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు డివిజన్ టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జి, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, తెరాస పార్టీ జనరల్ సెక్రెటరీ బండి రమేష్ ల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మక్తా మహబూబ్ పేట్ నుండి గుండె దయానంద్ ముదిరాజ్, కాసాని శ్రీధర్ ముదిరాజ్ నాయకత్వంలో టీడీపీకి చెందిన కె. ప్రభాకర్, పి. నర్సింగరావు, సిహెచ్ రాజు ముదిరాజ్, కాంగ్రెస్ కు చెందిన టి.నర్సింహ గౌడ్, సుభాష్ చంద్రబోస్, ఎం.అల్లబోయిన సంతోష్ ముదిరాజ్ లు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి టీఆర్ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభకు అన్వర్ షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ 108 డివిజన్ అభ్యర్థి ఉప్పల పాటి శ్రీకాంత్, మోహన్ ముదిరాజ్, బిఎస్ఎన్ కిరణ్, గంగాధర్, ప్రతాప్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, అన్వర్ షరీఫ్, గోపాల్, శ్రీనివాస్, చంద్రిక ప్రసాద్, రోజా, వరలక్ష్మి, ఖాజా, జహంగీర్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.