నమస్తే శేరిలింగంపల్లి: జెహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో నిలువనున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థుల జాబితాను బిజెపి రాష్ట్ర అధిష్టానం ఎట్టకేలకు విడుదల చేసింది. గ్రేటర్ లోని అన్ని డివిజన్లకు బిజెపి పార్టీ నుండి ఆశావహులు అధికంగా ఉండటంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమయం పట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలో బిజెపి అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ నుండి ఎం.రఘునాథ్, గచ్చిబౌలి నుండి వి.గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి నుండి ఎల్లేష్, మాదాపూర్ నుండి గంగుల రాధాకృష్ణ యాదవ్, మియాపూర్ నుండి కె.రాఘవేందర్ రావు, హఫీజ్ పెట్ నుండి బోయిన మహేష్ యాదవ్, చందానగర్ నుండి సింధు రఘునాథ్ రెడ్డి, వివేకానంద నగర్ నుండి ఉప్పల విద్య కల్పనా గౌడ్, హైదర్ నగర్ నుండి వెలగ శ్రీనివాస్ లకు పార్టీ బి ఫార్మ్స్ అందుకున్నారు.
Car 5 leda 10 alu Pani chestadhi tharvatha repairlu break downs untai