శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రశాంతి డెర్మా అండ్ పాలీ క్లినిక్ ను కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి డెర్మా అండ్ పాలీ క్లినిక్ డాక్టర్స్ యాదగిరి, ప్రశాంతిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేద, మధ్యతరగతి, దిగువ తరగతి, బలహీనవర్గాల ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయంతో కూడిన ఇలాంటి క్లినిక్స్ ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయమని అన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో, మంచి సేవలు అందిస్తూ, అందరి మనల్ని పొందుతూ ముందుకు సాగాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రశాంతి డెర్మా అండ్ పాలీ క్లినిక్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరసింహ సాగర్, బుడుగు తిరుపతి రెడ్డి, ప్రవీణ్, రవి నాయక్, ఆంజనేయులు, రవి, సాగర్ చౌదరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






