శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన నివాసంలో క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా జరిగిన క్రిస్టమస్ వేడుకలలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, క్రైస్తవుల సమక్షంలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేసి తదనంతరం పాస్టర్ల తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్‌లో..
మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎనక్లేవ్ కాలనీ లో ఉన్న రాక్ చర్చి లో క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా జరిగిన క్రిస్టమస్ వేడుకలలో క్రైస్తవుల సమక్షంలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేసి తదనంతరం పాస్టర్ల తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ స్వామి నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,గంగాధర్, ప్రసాద్ ,అమరెందర్ రెడ్డి , క్రైస్తవవులు తదితరులు పాల్గొన్నారు.