శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని కూకట్‌పల్లి బిజెపి కార్యాలయం వద్ద డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో ఏర్పాటు మెగా రక్తదాన శిబిరాన్ని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి రవికుమార్ యాదవ్, నాయకులు మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వాజ్‌పేయి దేశంలో అప్పట్లో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన దేశానికి, ప్రజలకు చేసిన సేవలను మరిచిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యారావు, నర్సింగ్ రావు, శ్రీనివాస్ గౌడ్, గోపాల్ రావు, సీతారామరాజు, మమత పాల్గొన్నారు.
మియాపూర్‌లో..
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్.బి.ఆర్ వద్ద భారతరత్న , మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.