హోరేబు మినిస్ట్రీస్ లో ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రిస్మస్ పర్వదిన సందర్బంగా హోరేబు మినిస్ట్రీస్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిధిగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ క్రిస్మస్ కేక్ ను అందించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు సందీప్, సుహాసిని, చర్చి పెద్దలు సంతోష్, సుధీర్, నాయకులు దార్గుపల్లి నరేష్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారికి బ‌హుమ‌తిని అంద‌జేస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా
కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క్రైస్త‌వులు

హ‌ఫీజ్‌పేట‌లో..

క్రిస్మస్ పర్వదిన సందర్బంగా హఫీజ్ పేట్ డివిజన్ లోని సాయి నగర్ కాలనీ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో జాన్సన్, రామకృష్ణ, హరీష్, శ్రీనివాస్, పాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కేక్ క‌ట్ చేసి తినిపిస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here