శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని సంకల్ప్ ఫౌండేషన్‌లో ప్రి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటి జయసుధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెజిస్ట్రేట్ నామాల అశోక్, నిర్వాహకురాలు గుండ్ర రోజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.