శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేక రాములు యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి వంశీ మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవుల హక్కులపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బిసి ఐక్యవేదిక చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాజకీయాల్లో యాదవులకు ప్రాధాన్యతను కల్పించాలని అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాదవులకు అవకాశం ఇవ్వాలన్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన తమను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యాదవ సమాజ అధ్యక్షుడు రాములు యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ యాదవ్, ఎల్లావుల చక్రధర్ యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, యువజన సంఘం అధ్యక్షుడు మధు యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు పాములేటి యాదవ్, మరముని శ్రీశైలం యాదవ్, గొడిగే శ్రీనివాస్ యాదవ్, జి రవి యాదవ్, అశోక్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ పిడికిలి ఆర్కె కృష్ణ యాదవ్, మల్లేష్ యాదవ్, వీరేందర్ యాదవ్, బత్తుల శ్రీనివాస్ యాదవ్, యాదవ్ విజన్ న్యూస్ ఛానల్ శ్రీనివాస్ యాదవ్, ఆర్కే సాయన్న, డీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు పాల్గొన్నారు.