శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): రావూస్ విద్యాసంస్థలకు చెందిన క్రీడోత్సవాలను బీహెచ్ఈఎల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్, రావూస్ విద్యాసంస్థల చైర్మన్ పొలసారి ప్రభాకర్ గారు, సీఈవో పొలసాని నిధిన రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి వారు బహుమతులను అందజేశారు.