శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున్ గౌడ్ 22 వ వర్థంతి సందర్భంగా ఆయన భార్య భాగ్యలక్ష్మి, ఆయన బాల్య మిత్రుడు BN చారి, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి నల్లగండ్లలోని మల్లికార్జున్ గౌడ్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు,చింతకింది రవీందర్ గౌడ్, నరేందర్ గౌడ్,విష్ణు వర్ధన్ రెడ్డి, పాండు గౌడ్, రాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన జగదీశ్వర్ గౌడ్..
మాజీ ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీ కృష్ణ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.