శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లో తెలంగాణ పాఠశాల విద్యా బోర్డు నుండి అనుమతులు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న మోషన్ హైదరాబాద్ ఫోల్కె స్కూల్ ప్రైవేట్ పాఠశాలపై మండల విద్యాధికారికి బిజెవైఎం రాష్ట్ర నాయకుడు రాగిరి సాయిరాం గౌడ్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన మండల విద్యాధికారి తక్షణమే నోటీసులు జారీ చేస్తామని తప్పకుండా సదరు పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.