శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న నాలా విస్తరణ పనులను, పలు రోడ్లను, డ్రైనేజి వ్యవస్థను జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 4 కోట్ల రూపాయల నిధులతో బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాలువ నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని, పనులు తుది దశలో ఉన్నాయన తెలిపారు. త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC EE Gkd ప్రసాద్, DE ఆనంద్, DE దుర్గాప్రసాద్, AE భాస్కర్, AE సంతోష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.