మియాపూర్, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పరిష్కరించవలసిన పలు సమస్యలపై, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై జలమండలి కార్యాలయంలో జలమండలి డీజీఎం వెంకటేశ్వరరావు, మేనేజర్ సునీతలతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్‌లో అక్కడక్కడా నెల కొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, పెరుగుతున్న జనావాసాలకు అనుగుణంగా డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ లైన్ పనులను ప్రారంభించి పూర్తిచేయాలని, డివిజన్ పరిధిలోని మంచి నీటి కొరత ఉన్న కాలనీల వాసుల దాహార్తిని తీర్చడానికి, అసంపూర్తిగా మిగిలి పోయిన మంచినీటి పైప్ లైన్ నిర్మాణం కోసం అదనంగా నిధులు మంజూరు చేయాలని, త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, వర్షాల కారణంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని శ్రీకాంత్ అన్నారు. అదేవిధంగా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు మంచినీటిని విడుదల చేయాలని, ప్రజల దాహార్తి తీర్చేవిధంగా, మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియజేశారు.