ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ధరణి నగర్ నాలా విస్తరణ పనులను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ రాంచందర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వేణు, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, కాశీనాథ్ యాదవ్, సమ్మారెడ్డి, కృష్ణారావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.