- బోయిని మహేష్ యాదవ్ ఖర్చులతో వాహనం ఏర్పాటు
హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ప్రజల కోసం బీజేపీ నాయకుడు బోయిని మహేష్ యాదవ్ దోమల పొగ మందు వాహనాన్ని అందజేశారు. తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఆ వాహనాన్ని ఆయన సోమవారం డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు అందజేశారు. డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, లక్ష్మణ్ గౌడ్, నవీన్, సాయ్ గౌడ్, శంకర్, శ్రీను, మహేందర్ రెడ్డి, మనోజ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.