మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుంచి రక్షించాలని కోరుతూ సీపీఐ శేరిలింగంపల్లి జాయింట్ సెక్రెటరీ టి.రామకృష్ణ సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మాదాపూర్‌లోని ఖానామెట్ గ్రామ సర్వే నంబర్లు 41/5, 41/8 లలో ఉన్న ప్రభుత్వ భూములకు కొందరు వ్యక్తులు కంచె ఏర్పాటు చేసి కబ్జా చేశారన్నారు. ఈ విషయమై అధికారులు కొంత మేర చర్యలు తీసుకున్నారని, అయినప్పటికీ ఫలితం లేదని, తిరిగి సదరు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని అన్నారు. అందువల్ల ఆయా స్థలాలను కబ్జాల నుంచి రక్షించాలని కోరినట్లు తెలిపారు.