ధరణి నగర్ నాలా విస్తరణ పనుల ప‌రిశీల‌న

ఆల్విన్ కాలనీ‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో కొన‌సాగుతున్న‌ ధరణి నగర్ నాలా విస్తరణ పనులను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. భారీ వ‌ర్షాల కార‌ణంగా మిగిలిపోయిన ప‌నుల‌ను వెంటనే పూర్తి చేయాల‌న్నారు. ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను పాటించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ రాంచందర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వేణు, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, కాశీనాథ్ యాదవ్, సమ్మారెడ్డి, కృష్ణారావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌పై అధికారుల‌తో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, చిత్రంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here