నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కాజాగుడా హరిజన బస్తి కి చెందిన దినాకర్ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంజూరైన ఆర్థికి సహాయానికి సంబంధించిన రూ. 2 లక్షల 30 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని తెలిపారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, హరినాథ్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.