- కొండాపూర్ లో భారీ రోడ్ షో
- గులాబీమయమైన దారులు
- కిక్కిరిసిన జనసందోహం
- కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించేందుకు మద్దతుగా కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్ షో కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేటీఆర్ తో పాటు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, రోజాదేవి రంగారావు, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా కేటీఆర్ మాటలివే…
- గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు కేసీఆరే సీఎం ఉండాలని కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించటంతో జిల్లాల్లో ప్రజలు కాస్త ఆగమయ్యారు.
- కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు మంచి ఉపాయం చెబుతా.
- మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మే 13న కారు గుర్తు మీద ఓటు వేయండి.
- 10-12 సీట్లు మాకు అప్పగించండి. 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.
- మనసు నిండా కేసీఆర్ మీద మీకు ప్రేమ ఉంది. అందుకే వేరే పార్టీ గురించి ఆలోచన చేయకండి.
- అరచేతిలో వైకుంఠం చూపించి మోచేతి కి బెల్లం పెట్టినట్లు చేసిన్రు.
- మహిళలకు రూ. 2500 రాలే, పింఛన్ రాలే, స్కూటీ లు రావు, తులం బంగారం రాదు.
- కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలె. అప్పుడే పిచ్చి వాగుడు వాగుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తది.
- 2014 బడే భాయ్ ఎన్ని హామీలిచ్చిండు. రూ. 15 లక్షలు అకౌంట్లో వేస్తా అన్నాడు. వచ్చినయా?
- ప్రతి ఒక్కరి కి ఇళ్లు, బుల్లెట్ ట్రైన్లు అన్నాడు. ఏమైనా వచ్చినయా?
- ఆయన పేరు నమో. అంటే నమ్మించి మోసం చేసేవాడు నరేంద్రమోడీ.
- పదేళ్లు హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు.
- శేరిలింగంపల్లిలో ఎక్కడ లేని విధంగా ఫ్లై ఓవర్లు, ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం.
- ఐటీఐఆర్ రద్దు చేసిండు, హైదరాబాద్ కు వరదలు వస్తే పైసా సాయం చేయలే. పరిశ్రమలు తెచ్చేందుకు సహకరించలే.
-
-
- బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే.. మేము గుడి కట్టినం అని అంటారు.
- గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి.
- దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా?
- పేదవాడు ఏ మతమన్నది చూడలేదు. మనిషిని మనిషిగా చూసి వాళ్ల కోసం పనిచేసింది కేసీఆర్.
- మోడీగారు ముస్లింలను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు. పదేళ్లు ప్రధాని చేసిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది?
- పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయలే.
- దేశంలోనే అత్యంత సామరస్యంగా ఉండే నగరాల్లో హైదరాబాద్ ఒక్కటి.
- కానీ ఇలాంటి హైదరాబాద్ ను ఆగం చేయాలని మోడీ భావిస్తున్నాడు.
- మోడీ ని 2014, 2019 లో బీజేపీ గెలుపును అడ్డుకున్నది కేసీఆర్ మాత్రమే.
- 2023 లో కూడా మొన్న బీజేపీ పెద్ద పెద్ద లీడర్లను ఓడించింది కూడా బీఆర్ఎస్సే.
- మేము బీజేపీతో కలుస్తామని రాహుల్ గాంధీ లాంటి వాళ్లు చెబుతున్నారు. వాళ్ల మాటలు నమ్మోద్దు.
- మేము బీజేపీతో కలిస్తే మా చెల్లెలు 50 రోజులుగా జైల్లో ఉంటుందా?
- బీజేపీతో పోరాడుతున్న వారిలో కేసీఆర్, కేజ్రీవాల్, స్టాలిన్ లాంటి వారితోనే సాధ్యమవుతుంది.
- కాంగ్రెస్ వాళ్లతోని కానీ…రాహుల్ గాంధీతో గాని కూడా బీజేపీని ఆపడం సాధ్యం కాదు.
- ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు.
- రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తో నడుస్తలేడు. మొత్తం బీజేపీ కనుసన్నుల్లోనే నడుస్తున్నాడు.
- రేవంత్ రెడ్డి ని నమ్ముకుంటే ఒక్క హామీ కూడా అమలు కాదు.
- తులం బంగారం రాదు, మహిళలకు రూ. 2500 రావు, ఫించన్ రాదు, స్కూటీలు రావు.
- ఎమ్మెల్యే గారికి ఒక జోడి దారుని ఇవ్వండి. మీరు 10-12 సీట్లు ఇవ్వండి.
-
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని పేదలకు అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.