- శేరిలింగంపల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గుప్త,శేరిలింగంపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణలో రెడ్డి, ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేస్తూ శేరిలింగంపల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గుప్త,శేరిలింగంపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి తదితరులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు.
కార్పొరేషన్ సాధనలో ఎన్నో సార్లు అరెస్టులు, నిర్బంధనలు ఎదుర్కొన్నామని, ఆనాటి పోరాటాలకి ఈ రోజు ఫలితం దక్కిందని వారు భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని, అన్ని వర్గాల అభివృది కోసం ప్రభుత్వ భరోసా ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని లక్ష్మణ్ గుప్త అన్నారు.
కార్పొరేషన్ల ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ పెద్దలకి, నాటి నుండి కార్పోరేషన్ సాధనలో పోరాడిన అన్ని రెడ్డి సంఘాలకి నల్ల సంజీవ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.