నమస్తే శేరిలింగంపల్లి : మహిళ సాధికారిత, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని, అన్ని వర్గాల అభివృది కోసం ప్రభుత్వ భరోసా ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.
గత ప్రభుత్వం 2018 మేనిఫెస్టోలో ప్రకటించి కూడా గెలిచాక ఏర్పాటు చేయకుండా ప్రజలను మోసం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజులలోపే వివిధ కార్పొరేషన్ల ఏర్పాటుకు కాబినెట్ ఆమోదం తెలపడం, మహిళ సాధికారిత కోసం మహిళ పొదుపు సంఘాలకు నిధులు విడుదల చేయడం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమని కొనియాడారు. దళిత,గిరిజన,బహుజనుల,మహిళ సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పని చేస్తుందని, తెలంగాణ కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, మహిళలకు రుణాలు మంజూరు చేయడం, దళిత, గిరిజన, బహుజన కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు సయ్యద్ గౌస్, నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, నాగేశ్వరరావు, మహిపల్ యాదవ్, సురేష్ నాయక్, గోపాల్ నాయక్, హున్య నాయక్, జి.వి రెడ్డి, ప్రసాద్, రాజన్, సాజిద్, మునఫ్ ఖాన్, ఇస్మాయిల్, హమీద్, అష్రాఫ్, ప్రేమ కుమార్, మహిళలు సునీత రెడ్డి, శశిరేఖ, సీతమ్మ, శ్రీజ రెడ్డి, పార్వతి, లక్ష్మీ పాల్గొన్నారు.