నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో రూ. 15 లక్షలు అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వేసవికాలంలో పిల్లలు ఆడుకోవడానికి వినియోగించుకోవాలని సూచించారు. పార్కులలో ఆటలు పిల్లల్లో నూతనోత్తేజం పెంపొందుంతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, భిక్షపతి, రెహనా బేగం, రాజేష్, దాసరి సరిత, నాగరాజ, కుటుంబరావు, అరుణ శ్రీ, చోడమని, హాసిని, రామారావు, నయిముద్దీన్, మునీందర్ పాల్గొన్నారు.