- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నహస్తం అందిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హాస్పిటల్ ఖర్చులకు గాను పలువురు బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఎల్‌వోసీ పత్రాలను వారికి గాంధీ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తుదంని, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుందని తెలిపారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదిస్తే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా చూస్తామన్నారు.