చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్పాఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్బంగా బుధవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8 గంటలకు శ్రీలక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం, అర్చన నిర్వహిస్తామని, 10 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కల్యాణం జరుగుతుందన్నారు.
స్వామి వారి పూజలకు భక్తులు హాజరు కావచ్చని తెలిపారు. భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవచ్చని అన్నారు. భక్తులు పూజలకు రాలేకపోతే తమ గోత్రనామాలు చెప్పి ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి పూజలు చేయించుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు 9492126990 ఫోన్ నంబర్‌లో ఆలయ ఇన్‌చార్జి ఉమామహేశ్వర రావును సంప్రదించవచ్చన్నారు. అభిషేకం, అర్చనలకు రూ.101 చెల్లించాలని తెలిపారు.