ఫ్రెండ్స్ కాలనీ అపార్ట్మెంట్స్ పట్టభద్రులను కలిసిన కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పిలుపునిచ్చారు. డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ క్లాసిక్ అపార్ట్మెంట్, చిన్మయి అపార్ట్మెంట్, సిగ్మా అపార్ట్మెంట్, పల్లవి అపార్ట్మెంట్, రాఘవేంద్ర అపార్ట్మెంట్, సిగ్మా అపార్ట్మెంట్ వాసులకు ఫామ్ 18 పత్రాలను సోమవారం ఆమె అందచేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యూత్ సభ్యులు పని చేయాలని అన్నారు. గౌరవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు.

ఫ్రెండ్స్ కాలనీ అపార్ట్మెంట్స్ పట్టభద్రులకు ఫామ్ 18 పత్రాలను అందజేస్తున్న కార్పొరేటర్ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here