నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ హైకోర్టు న్యాయవాదిగా అడ్వకేట్ పట్టా పుచ్చుకున్న ఐలాపూర్ గ్రామ నివాసి పి.మాణిక్ యాదవ్ ను పటాన్ చెరు ముత్తంగి గ్రామంలో బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ న్యాయానికి కట్టుబడి ఉండాలని, అన్యాయాన్ని ఎదిరించాలని, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలచి వారిని గెలిపించాలని సూచించారు.

ఇలా చేస్తూ మరెంత ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో బిల్డర్ ప్రసాద్ యాదవ్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, హరిబాబు యాదవ్, గంగల మల్లేష్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, ఎర్ర గొల్ల సతీష్ యాదవ్, సిహెచ్ యాదవ్, కృష్ణ యాదవ్, తుమ్మటి మల్లేష్ యాదవ్, పద్మారావు పాల్గొన్నారు.





