ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలి

  • కార్యకర్తలకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సూచించారు. ప్రతి కేంద్రంలో పర్యవేక్షించాలని, జనవరి 6 లోపు అర్హలుందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ది కోసం దరఖాస్తున్న చేసుకోవాలని ప్రజలకు తెలిపారు.

ఆరు గ్యారెంటీల గురించి అడిగి తెలుసుకుంటున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హమీద్, నియోజకవర్గ నాయకులు మహిపల్ యాదవ్, డివిజన్ నాయకులు రహీం, మునఫ్ ఖాన్, ఖాజా, ఫైజల్, అంజద్, ఇమ్రాన్ పాల్గొన్నారు.

ప్రజా పాలన కేంద్రాలలో ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియను పరిశీలిస్తున్న జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here