నేతాజీ నగర్‌లో ఘనంగా శ్రీ సాయినాధుని 16వ వార్షికోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జూన్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో ఉన్న గుల్‌మోర్ పార్క్‌లోని శ్రీ సాయి బృందావన క్షేత్రంలో శ్రీ సాయినాధుని 16వ వార్షికోత్సవ వేడుకల‌ను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు జోషి రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ మాధవ నంద సరస్వతి స్వామివారికి పాదపూజ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం చేపట్టగా, సాయి ఫోటో స్టూడియో యజమాని, అమృత పతంజలి యోగ గురువు గారెల వెంకటేష్ అమృత ముదిరాజ్ కుటుంబ సభ్యుల సహకారంతోపాటు పలువురు దాతల సహాయంతో అన్న సమారాధన నిర్వహించారు.

వేడుకల్లో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, ఆలయ ప్రధానార్చకుడు జోషి రాఘవేంద్ర శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీవాసులు కుటుంబ సమేతంగా హాజరై శ్రీ గురుదత్త సద్గురు సాయినాధుని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సాయినాధుని దీవెనలతో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో ఐకమత్యం నెలకొని అందరూ సోదరభావంతో ఉండాలని భగవంతుణ్ని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, నెహ్రూ నగర్ శ్రీకాంత్, నరసింహ, నాందేవ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, నారాయణ, మహిళా సంఘం సభ్యులు చిట్టెమ్మలాల్ రెడ్డి, సత్యమ్మ, వెంకటేష్ మేస్త్రి, మనోజ్ ముదిరాజ్, ఎన్‌ఎన్ రెడ్డి, బోటిక్ టెక్స్టైల్స్ ప్రోప్రైటర్ కుషన్ రెడ్డి దంపతులు, మౌలానా, సాయి భక్తులు ఆగమయ్య గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here