శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన తాజా నాచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్ నువా (NUWA)ను ఆవిష్కరించింది. ప్రకృతిలో కనిపించే సున్నితమైన ఆకృతులు, నిర్మాణాలు, అందమైన నమూనాలు, సహజ సృష్టి అద్భుతాల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కలెక్షన్ ఆధునిక విలాసవంతమైన శైలిని ప్రకృతి అందాలతో మేళవిస్తూ రూపుదిద్దుకుంది. గీతలు, తేనెగూడు నమూనాలు, భూమి సహజంగా సృష్టించిన ఆకృతులు, జీవంతో నిండిన ప్రకృతి డిజైన్ల వంటిదృష్టికి తరచూ అందని సూక్ష్మ అంశాలను నువా కలెక్షన్ ప్రత్యేకంగా ప్రతిబింబిస్తోంది. 18 క్యారెట్, 14 క్యారెట్ బంగారంతో రూపొందించిన ఈ ఆభరణాల్లో నాచురల్ డైమండ్స్తోపాటు రంగురంగుల రత్నాలు, సిరామిక్ కలర్ ఎనామెలింగ్, బహువర్ణ రోడియం ఫినిష్‌లను వినియోగించి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిర్మాణ బలాన్ని, సున్నితమైన అందాన్ని సమతుల్యం చేసే విధంగా రూపొందించిన ఈ కలెక్షన్లోని ఆభరణాలు వివిధ సందర్భాలకు అనువుగా ఉండే ఆధునిక, సొగసైన రూపాన్ని అందిస్తున్నాయి. ప్రతి డిజైన్ ప్రకృతి ఆకృతుల వైవిధ్యాన్ని నైపుణ్యపూర్వకమైన హస్తకళ, సమకాలీన సౌందర్యం, ప్రవాహమయమైన రూపాలతో ప్రతిబింబిస్తుంది. ఈ కలెక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ కొనసాగుతున్నారు. ఆమె సహజమైన సొగసు, ఆత్మవిశ్వాసం, కాలాతీత ఆకర్షణ ఈ కలెక్షన్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న ప్రపంచానికి నిశ్శబ్దంగా ఆకారమిస్తున్న ప్రకృతి సూక్ష్మ నిర్మాణాలు, ఆకృతులు, వివరాల అందాన్ని వేడుక చేసుకోవడమే నువా ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆధునిక నాచురల్ డైమండ్ ఆభరణాల రూపంలో ఆవిష్కరించాలనే ఆలోచనతో ఈ కలెక్షన్‌ను రూపొందించామని, ఇది సొగసైనదిగా ఉండటంతోపాటు నేటి మహిళల జీవనశైలికి అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు.
సరళమైన విలాసాన్ని, అర్థవంతమైన డిజైన్లను ఇష్టపడే మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రకృతిలోని సమతుల్యత, సామరస్యం ఈ డిజైన్లకు ప్రధాన ప్రేరణగా నిలిచాయని పేర్కొంది. నువా కలెక్షన్‌తో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన నాచురల్ డైమండ్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తోంది. హస్తకళా నైపుణ్యం, డిజైన్ ఆవిష్కరణ, సమకాలీన విలాసాన్ని సమన్వయం చేసిన ఈ కలెక్షన్ ప్రకృతి ప్రేరణల ఆధారంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక ఆభరణాల శ్రేణిగా నిలుస్తుందని సంస్థ తెలిపింది.





