శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ హుడా కాలనీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో, కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ సహకారంతో వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ దేశంలో మహిళా సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దోహదపడుతోందని పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న మహిళలు నాణ్యమైన ఆహార పదార్థాలతో వివిధ రకాల వంటకాలను తయారు చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆరోగ్యవంతమైన కుటుంబ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని రవికుమార్ యాదవ్ అన్నారు. పోటీలో పాల్గొన్న మహిళలను అభినందిస్తూ వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో బోయిని అనూష మహేష్ యాదవ్, జితేందర్, విజయలక్ష్మి, పార్వతి, జ్యోతి, సింధూర, లక్ష్మి, శిరీష, నవనీత, అడ్వకేట్ ఆమని, దేవాల్ యాదవ్, రమణయ్య, శ్రీనివాస్ యాదవ్, మనోహర్ గౌడ్, మనోజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





