– పాపిరెడ్డి కాలనీ నుంచి పాదయాత్రను ప్రారంభించిన గజ్జల యోగానంద్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ ఆద్వర్యంలో మార్పుకోసం బిజెపి యాత్ర పేరిట పాదయాత్రను ప్రారంభించారు. శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి అధ్యక్షుడు రాజుశెట్టి అధ్యక్షతన రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ నుండి ఆదివారం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర అసెంబ్లీ లోని అన్ని డివిజన్ లలో కొనసాగుతుందని, ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వారి మొద్దు నిద్రనుంచి లేపేందుకు జన గళమే, బీజేపీ బలంగా ఈ పాద యాత్ర లక్ష్యం అన్నారు. శేరిలింగంపల్లి నియోజికవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తెరాస ప్రభుత్వం ఏవీ నెరవేర్చలేదన్నారు.
నియోజకవర్గ పరిధిలో ఒక్క డబల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదాని, చెరువులు ఖబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని, రోడ్లు పాడైపోయి గుంతలుపడ్డా, మ్యాన్ హోల్స్ నోళ్లు తెరుచుకొని వున్నా తెరాస ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ఎద్దేవా చేసారు. మొన్న కురిసిన వానలు ప్రజలకు కన్నీళ్ళని తెప్పించడమే కాకుండా కళ్ళను తెరిపించిందని, ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వరద సాయం పంపిణిలో కూడా తెరాస తన బుద్ధి చూపించిందని, ఎంతో మందికి రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం అన్యాయమని, అందరు భాదితులకు సహాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలకు బాసటగా నిలుస్తూ తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, అరాచక పాలనను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కాంచన కృష్ణ, సత్య కుర్మ, కొడిదల బాబు, బాలరాజు, వీరేశ్ ఖేల్గీ, సూర్ణ రాజు కుర్మ, రజనీ, క్రాంతి మాదిగ, శ్రీకాంత్, రాజు, రవి, కిరణ్, మహేశ్ రాపన్, కిరణ్, గిరి, జగదీశ్, బసంత్, శివ, నరసింహ, యార బబ్లు, డీ. నవీన్ ముదిరాజ్, రాజు, శ్రీనివాస్, నరసింహ, రమేశ్ ముదిరాజ్, అరుణ కుమారి, కే. శ్రీలత, ఎం. లక్ష్మ, బబ్లీ గుప్త, సాయి వెంకట్, రమేశ్ సొమిశెట్టి, శంకర్, మనోజ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.