ప్రభుత్వ విప్ గాంధీతో సమావేశమైన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి ఆదివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులనువేగవంతం చేసేలా అధికారులను ఆదేశించాలని గాంధీని నవత రెడ్డి కోరారు. దీప్తి శ్రీ నగర్ కాలనీ, సిటిజెన్ కాలనీ, కైలాష్ నగర్ కాలనీ, విద్యా నగర్, తారానగర్, జవహర్ కాలనీ, వేముకుంట బస్తి, ఫ్రెండ్స్ కాలనీ, కేఎస్ఆర్ కాలనీ, చందా నగర్, గౌతమి నగర్ కాలనీ, శంకర్ నగర్ కాలనీ, తదితర కాలనీ లో మంజూరైన సి.సి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను త్వరగా మొదలు స్థానికుల సమస్యలను పరిష్కరించాలని కొరటం జరిగినది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి రఘునాధ్ రెడ్డి, పోచయ్య, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీతో మాట్లాడుతున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here