హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,ప్రతి మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కార్పొరేటర్ వి.జగదీశ్వరగౌడ్ అన్నారు.
శుక్రవారం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా నాణ్యత తో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్,నాయకులు బాలింగ్ గౌతం గౌడ్, ఆనంద్ గౌడ్,శేఖర్ గౌడ్,సుదర్శన్,సయ్యద సత్తార్ హుస్సేన్,సాబేర్, బస్తి అధ్యక్షులు ముఖ్తర్,మైనారిటీ నాయకులు బాబు మియా,సలీం,స్థానిక నాయకులు సత్యనారాయణ,రములు యాదవ్,రామకృష్ణ,బుజంగం,నర్సింలు,వెంకటేష్,మహిళలు శేషిరేఖ,నళిని,శ్రీజ రెడ్డి,మొగులమ్మ తదితరులు పాల్గొన్నారు..