మంచి ఆరోగ్యం కోసం పోషక విలువలు గల ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ అంగన్వాడీ సెంటర్ ను నెహ్రు యువ కేంద్ర ఇంచార్జి కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సంబంధించి పోషక ఆహరం పంపిణీ పై ఆరా తీశారు. అనంతరం జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆహారంలో సమతుల్యత, వైవిద్యం,పరిమితంగా ఉండే విధంగా చూసుకోవలన్నారు. కేలరీలు శృతిమించకుండా ఒకే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా ఆహార నియమాలను పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవలన్నారు. పిల్లలకు తల్లి పాలు 2 సంవత్సరాల వరకు తప్పకుండా ఇవ్వాలి అన్నారు. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు నిత్యం ఆహారంలో తీసుకోవాలన్నారు. నీళ్లను ఎక్కువగా తాగాలి, శుభ్రమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి అన్నారు.అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, అంగన్వాడీ టీచర్ కావేరి,ఆశావర్కర్లు, బిజెపి డివిజన్ అధ్యక్షులు మణిక్ రావు, నాయకులు కళ్యాణ్, లక్ష్మణ్, రామకృష్ణ, విజేందర్, పాపయ్య, సిద్దు,రాజు, అనిల్ ,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.