నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన నృత్యార్చన అలరించింది.
ఈ కార్యక్రమంలో తొలుత శోభారాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించిగా అనంతరం “నృత్య జ్యోతి కూచిపూడి అకాడమీ” గురువు మాధవి శిష్యులు తనిష్క, హంసిని, యశ్విత, హిమశ్రీ, తపస్య, ఆర్దృతి, శ్రేష్ట, ఝంఝాటి సంయుక్తంగా వేంకటేశ్వరస్వామికి అన్నమయ్యపురంలో నృత్య కైంకర్యం చేశారు. కార్యక్రమంలో “వినాయక కౌతం, రాజశ్రీ శబ్దం, రామాయణ శబ్దం, త్యాగరాజ కృతి, మైసూరు వాసుదేవాచారి కీర్తన, దశావతార శబ్దం, గోపికృష్ణ రూపకం” అన్నమాచార్య కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అనంతరం శోభా రాజు ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళ హారతి ఇచ్చారు. పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.