నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారులు సమీక్ష, పూజా ఇద్దరూ కలిసి పుష్పాంజలి, అర్ధనారీశ్వర కృతి, జనని నినువిన కృతి, తిల్లానా అంశాలను ప్రదర్శించారు.
సత్య కీర్తి నృత్యధామం గురువర్యులు దొడ్డ బాలాజీ, శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహనం, బ్రహ్మాంజలి, తరంగం, భామకలాపం, లింగాష్టకం, దశావతారం, భో శంభో, రామాయణం, త్యాగరాయ కృతి, శివాష్టకం, అన్నమయ క్రతువులు, బృందావన తిల్లానా, కొలువైఉన్నదే మొదలైన అంశాలను కళాకారులు కీర్తన, సంజన, సత్య, హంసిని , అర్థిక సాయి, తన్వికా, సమికా, అంజన. ఆధ్య, హేమాన్షి, తనీషా ప్రదర్శించారు.