నమస్తే శేరిలింగంపల్లి: మట్టి వినాయకులను పూజించడం.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నది జై గణేశ భక్త సమితి. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలంటూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది.

ఇందులో భాగంగా చందానగర్ లోని గంగారాం వాసి రోహిత్ ముదిరాజ్ ను తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించింది ఆ సమితి. తనపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్బంగా జై గణేశ భక్త సమితి అధ్యక్షుడికి కృతఙ్ఞతలు తెలిపారు.





