నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి టీడీపీ 107 డివిజన్ మాదాపూర్ ప్రధాన కార్యదర్శిగా తన్నీరు భవానిని నియమించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజక వర్గం ఇంచార్జి వెంకటేష్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అద్యక్షులు శివ గౌడ్, టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాద్యక్షులు తన్నీరు ప్రసాద్ ఆధ్వర్యంలో నియామకం జరిగింది. ఈ సందర్బంగా తన్నీరు భవాని మాట్లాడుతూ టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకముంచి ప్రధాన కార్యదర్శిగా నియమించిన తన్నీరు ప్రసాద్, వెంకటేష్ గౌడ్, శివ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.