నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి 106 డివిజన్ లోని అనేక ప్రాంతాలలో వీధిదీపాలు వెలగక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై స్థానిక డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్ జిహెచ్ఎంసి ఎలక్ట్రిక్ ఈఈ దృష్టికి తీసుకెళ్ళారు.
వర్షాకాలం నేపథ్యంలో డివిజన్ లోని మహిళలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకొని చందానగర్ రైల్వే స్టేషన్, జెడ్ పి హెచ్ ఎస్ దగ్గర ఉన్న టవర్ లైట్స్ కి మరమ్మతులు చేసి నూతన లైట్స్ ఫిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన కూడళ్లతో పాటు వీధి లైట్స్ కూడా పరిశీలించి పని చేయని వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని లిఖితపూర్వకంగా స్థానిక డివిజన్ ఎం ఎస్ యు ఐ అధ్యక్షుడు అశోక్ తో కలిసి మనవి చేశారు.