ఆప‌ద‌లో ఉన్న అంద‌రినీ ఆదుకుంటాం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వ‌ర‌దల కార‌ణంగా నిరాశ్ర‌యులైన ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్, వాంబే స్కీమ్ ల‌కు చెందిన‌ పేదలకు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంపున‌కు గురైన ప్రాంతాల్లో పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. వారు ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో స‌రుకునులం అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు విప‌త్క‌ర ప‌రిస్థితిలో తోడుగా ఉంటామ‌ని తెలిపారు. క‌ష్ట‌కాలంలో ప్ర‌తి ఒక్క‌రినీ ఆదుకుంటామ‌న్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రామకృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీను, బోయ కిషన్, రాజేష్ చంద్ర, రాములు, వెంకటేష్, శివ నాగేశ్వర్ రావు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here