శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎంఐజీలో భూకుంభకోణం జరిగిందంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు ఈ విషయాన్ని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎంఐజీలో భూకుంభకోణం జరిగిందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ‘జనం కోసం’ చేసిన ఫిర్యాదుకు మంత్రి స్పందించారని భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఎంఐజీలో ప్రజలకు చెందిన ఆస్తులను అమ్ముతున్నారని, లీజుకు ఇస్తున్నారని కిషన్ రెడ్డికి జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. జనం కోసం చేసిన ఫిర్యాదు పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మంత్రి లేఖ రాశారు. సొసైటీపై వచ్చిన అవకతవకల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు లేఖ ద్వారా కేంద్ర మంత్రి సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడంపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.