మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ కి చెందిన బిజెపి, టీడీపీ సీనియర్ నాయకులు మియాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి గాంధీ తెరాస పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీలకు చెందిన నాయకులు తెరాసలో చేరుతున్నారని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండడం విశేషమన్నారు. తెరాసలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు.
తెరాస పార్టీలో చేరిన వారిలో మియాపూర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి ముద్దన ఉమాదేవి, మియాపూర్ డివిజన్ టీడీపీ ఉపాధ్యక్షుడు దాసరి మురళి కృష్ణ, మియాపూర్ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు రావిపాటి నర్సింహా రావు, కల్పన తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వెంకటేశ్వర్లు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.