నమస్తే శేరిలింగంపల్లి: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఇటీవల కోలుకున్న గచ్చిబౌలికి చెందిన ప్రసాద్ (39)కు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ తరుపున రూ. 20 వేల నగదును అందజేశారు. చందానగర్ హుడాకాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యకుడు కొండ విజయ్, అధ్యక్షుడు తొపుగుండ మహిపాల్ రెడ్డి, ట్రెజరర్ ప్రవీణ్ రెడ్డి, ఘాలి కృష్ణ, మారం వెంకట్, మధూసూధన్ రెడ్డి, మారం ప్రసాద్ పాల్గొన్నారు.