- రామగుండంను మరో స్వచ్ఛ ఇండోర్ చేద్దామని ప్రజలకు కార్పొరేటర్ శివ కుమార్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: ఐఏఎస్ నరహరి రాసిన ‘ ‘స్వచ్ఛ ఇండోర్ నగర్ ‘ పుస్తకాన్ని రామగుండం కమిషనర్ ను 32వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివ కుమార్ కలిసి అందజేశారు. దేశంలో స్వచ్ఛతలో ఇండోర్ ని మొదటి స్థానంలో నిలిపిన ఐఏఎస్ నరహరి తమ ప్రాంతం బిడ్డ అవ్వడం గర్వ కారణమని అన్నారు. భారత దేశంలో రామగుండంను మొదటి స్థానంలో నిలిపేందుకు నరహరి నమ్మిన సూత్రాన్ని పాటిద్దాం.. తొలి అడుగు వేద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి, ntpc, ఇతర నిధులు బయటకి వెళ్లకుండా రామగుండం కోసం ఖర్చు పెట్టేలా చూస్తే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఇందుకోసం రామగుండం కార్పొరేషన్ కి నరహరిని ఆహ్వానించి ఆయనతో చర్చించి మరో ఇండోర్ లాగా మార్చుకుందామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్, గ్రామపంచాయతీలలో ఈ పుస్తకాల పంపిణి చేపడతాం.. స్వచ్ఛతలో ముందుకు ఎలా నడవలో, ఎలాంటి ప్రణాళికలు రచించాలో తెలియజేసే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.