శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెరాస నాయకురాలు, గుడ్ల ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం గుడ్ల ధనలక్ష్మి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆమె వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తనపై అభిమానులు, కార్యకర్తలు చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞుడనని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.