ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న ప్రజలను శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని చంద్రకళ అనే మహిళ ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆమెకు రవికుమార్ యాదవ్ 25 కేజీల బియ్యం అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని రవికుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింగ్‌యాదవ్, నాయకులు సీతారామరాజు, రవి, ఎల్లయ్య, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.