భారీ వ‌ర్షానికి లింగంప‌ల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వ‌ద్ద జ‌ల‌మ‌యం

  • స్పందించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
  • వ‌ర్ష‌పు నీరు తొల‌గింపు, ట్రాఫిక్ మ‌ళ్లింపు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి డివిజన్ ప‌రిధిలో ఆదివారం కురిసిన భారీ వర్షంతో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో హుటాహుటిన శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద మొత్తం వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లడంతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దగ్గరుండి వాహనాలను మళ్లించారు.

లింగంపల్లి రైల్వే అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద ర‌హ‌దారిపై భారీగా చేరిన వ‌ర‌ద‌నీటిని ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సిబ్బంది సహకారంతో నిలిచిన వర్షపు నీటిని తొలగింపజేయించారు. గంట సేపట్లో నిలిచిన వర్షపు నీరు ను తొలగించడంతో ట్రాఫిక్ సమస్య తీరి వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. దీంతో వాహనదారులు అప్పటికప్పుడు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, తారానగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు జనార్థన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here